Condolance| మునీర్ మృతి కి రేవంత్, కెసిఆర్ సంతాపం

హైదరాబాద్ : సీనియర్ పాత్రికేయుడు ఎండి మునీర్ మృతి పట్ల ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. వృత్తి పట్ల నిబద్ధత, సామాజిక ఉద్యమాల పట్ల అంకితభావం కలిగిన మునీర్ మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

వివిధ పత్రికల్లో పనిచేసిన మునీర్ సింగరేణికి సంబంధించి ఎన్నో విషయాల్లో ప్రజలను చైతన్య పరిచారన్నారు. మనీర్ మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు అని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కేసీఆర్ సంతాపం

సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ జర్నలిస్టుల సంఘం నేత ఎండీ మునీర్ మ రణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సింగరేణి కార్మికుల నడుమ జీవిస్తూ, వారి సమస్యలను వెలుగులోకి తెస్తూ, నిబద్ధత కలిగిన పాత్రికేయుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన మునీర్ కృషి గొప్పదన్నారు. టీజేఎఫ్ నేతగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో సింగరేణి ప్రాంత ప్రజా సంఘాలను, ఉద్యమ శక్తులను సమన్వయం చేయడంలో, వారిని చైతన్యపరచడంలో జర్నలిస్టుగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. మునీర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

మునీర్ మరణం తీరని లోటు..

మునీర్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సింగరేణి, ఉత్తర తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన మునీర్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి సకల జనుల సమ్మె కన్వీనర్ గా మునీర్ పోషించిన పాత్ర చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. మునీర్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

హరీశ్ రావు సంతాపం…

సీనియర్ జర్నలిస్ట్ ఎం డి మునీర్ మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా సేవలందించిన ఆయన, సింగరేణి కార్మికుల కష్టాలను, సమస్యలను వెలుగులోకి తెచ్చారు. మంచి పాత్రికేయుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. – తన్నీరు హరీష్ రావు,మాజీ మంత్రి, ఎమ్మెల్యే

Leave a Reply