AP| పుంగనూరు నియోజకవర్గంను అన్నమయ్యలోకి కలుపుతూ నోటిఫికేషన్

చిత్తూరు, ఆంధ్రప్రభ: మెరుగైన పరిపాలన, అభివృద్ధి దృష్ట్యా, ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుండి పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదం మండలాల మండలాలను, చిత్తూరు జిల్లాలోని చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుండి రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను మదనపల్లె రెవెన్యూ డివిజన్ కింద ఉన్న అన్నమయ్య జిల్లాకు బదిలీ చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలలో నివసిస్తున్న వారి నుండి అభ్యంతరాలు లేదా సూచనలను ఆహ్వానించారు. వీటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. అన్ని అభ్యంతరాలు లేదా సూచనలు ఇంగ్లీషు లేదా తెలుగులో లిఖితపూర్వకంగా ఉండాలన్నారు. ఈ నోటిఫికేషన్ ప్రచురించబడిన తేదీ నుండి ముప్పై రోజుల గడువు ముగిసేలోపు లేదా అంతకు ముందుగా చిత్తూరు జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకునేలా పంపాలని కోరారు.

Leave a Reply