AP | సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో దక్కని ఊరట

న్యూ ఢిల్లీ – ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వైసిపి నేత స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డికి సుప్రీం కోర్టులో నిరాశ మిగిలింది.. ఈ కేసులో ముంద‌స్తు పిటిష‌న్ కోసం వేసిన పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఇలాంటి కేసుల్లో బెయిల్‌ సులభంగా వస్తే ప్ర‌తి ఒక్కరూ రెచ్చిపోతారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని కోరింది ధర్మాసనం. కాగా, సోషల్ మీడియా పోస్టులకేసులో సజ్జల భార్గవరెడ్డికి అరెస్ట్‌ నుంచి మధ్యంతర రక్షణ పొడిగించింది..

Leave a Reply