గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్లో పెచ్చులూడి బాలుడు మృతి చెందాడు . ఏడో నెంబర్ ప్లాట్ ఫాం వద్ద పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. నేటి ఉదయం బాలుడు రైలు ఎక్కేందుకు వేచి చూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రామేశ్వరం వెళ్లేందుకు కుటుంబంతో ఆ బాలుడు ఇక్కడికి వచ్చినట్లు గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
AP| గుంతకల్లు రైల్వేస్టేషన్లో పైకప్పు పెచ్చులూడి బాలుడి మృతి
