93. అరాళాకేశేషు ప్రకృతి సరళా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభాకుచతటే
భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహవిషయే
జగత్త్రాతుంశంభోర్జయతి కరుణా కాచిదరుణా.
తాత్పర్యం: కురులలో మాత్రమే వంకరతనము, చిరునవ్వులో సహజంగా ఉండే సరళత్వం, మనస్సులో దిరిసెన పువ్వులో ఉండే మెత్తదనం, పాలిండ్లలోసన్నికల్లుకి ఉండే కాఠిన్యశోభ, నడుము వద్ద సన్నదనం, వక్షస్థలం వద్ద పిఱుదుల వద్ద స్థూలత్వం కలిగి వర్ణనాతీతమైనది, సదాశివుడి యొక్క కరుణాస్వరూపమైన అరుణ అనే శక్తి జగత్తుని రక్షించటానికి సర్వోత్కృష్టమైవర్తిస్తున్నది.
- డాక్టర్ అనంత లక్ష్మీ