కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు-విజయవాడ మధ్య జూలై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రస్తుతం ఈ సర్వీసు సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందని… త్వరలో ప్రతిరోజూ ఈ విమాన సర్వీసును నడుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పినట్టు మంత్రి టి.జి. భరత్ తెలిపారు.
ఓర్వకల్లు పారిశ్రామికాభివృద్ధికి విమాన సేవలు చాలా ముఖ్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పలుమార్లు సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు గుర్తు చేశారు.
అడిగిన వెంటనే దీనిపై స్పందించి విమాన సర్వీసు అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర మంత్రికి.. కర్నూలు జిల్లా ప్రజల తరుపున మంత్రి టి.జి భరత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.