AP | విద్యుత్ షాక్ తో యువ రైతు దుర్మరణం..

కోసిగి: మండల కేంద్రమైన కోసిగి కడే పాళ్యం వీధికి చెందిన దొడ్డి రామయ్య, తాయమ్మల కుమారుడు నాగరాజు (19) అనే యువ రైతు (ఆదివారం) పంట పొలంలో నీళ్లు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై దుర్మరణం చెందాడు.

నాగరాజు కుటుంబ సభ్యులు కోసిగి సమీపంలోని పెండెకల్లు పోలాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ఆదివారం బంధువుల పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులు నాగరాజును పొలం వద్ద వదిలేసి వివాహ వేడుకకు వెళ్లారు. ఈ సమయంలో నాగరాజు ఉల్లి పంటకు నీళ్లు పట్టేందుకు మోటార్ ఆన్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

స్థానికులు విషయాన్ని గమనించి వెంటనే కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నాగరాజును తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విద్యుత్ షాక్ కారణంగా త‌మ కుమారుడు కొడుకు మ‌ర‌ణించ‌డంతో రామయ్య, తాయమ్మ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు, బంధువులు నాగరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply