కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురంలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలోపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను శాలిని (5), అశ్విన్ (6), గౌతమి (8)గా గుర్తించారు.
ఇంటి పునాది కోసం తవ్విన గుంతలో వర్షం నీరు చేరింది. ఆడుకుంటూ అటువైపుగా వెళ్లిన చిన్నారులు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి