న్యూ ఢిల్లీ : భారత్ బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువులపై భారత్ ఆంక్షలు విధించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులను కోల్‌కతా, నవా షెవా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు. అలాగే ఈశాన్యంలోని ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి కూడా పలు వస్తువుల దిగుమతిని నిషేధించింది. వీటిలో రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కార్బోనేటేడ్ పానీయాలు ఉన్నాయి.
ఈ వస్తువులను మేఘాలయ, అసోం, త్రిపుర, మిజోరం, పశ్చిమ బెంగాల్‌లోని పుల్‌బారి, చంగ్రబంధలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, చెక్ పోస్టుల ద్వారా భారత్‌లోకి అనుమతించరు.
అయితే, ఈ ఆంక్షలు భారత్ గుండా భూటాన్, నేపాల్‌లకు రవాణా చేసే బంగ్లాదేశ్ వస్తువులకు వర్తించవు.