IPL 2025 | బ్యాడ్ న్యూస్.. ఆర్సీబీ × కేకేఆర్ మ్యాచ్ కు వరుణుడే విల‌న్ !

ఐపీఎల్ 2025 సీజన్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అభిమానులకు బ్యాడ్ న్యూస్. రివైజ్డ్ ఐపీఎల్ షెడ్యూల్‌లో భాగంగా, ఈరోజు (శనివారం) బెంగళూరులో జరగాల్సిన ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.

బెంగళూరులో సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఔట్ ఫీల్డ్ అంతా నీరు చేర‌గా… పిచ్ పై క‌వ‌ర్లు క‌ప్పి ఉంచారు. టాస్ ప‌డే స‌మ‌యానికి కూడా వ‌ర్షం త‌గ్గక‌పోండంతో… వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది.

ఆర్‌సీబీ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 16 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఓ మ్యాచ్ రద్దవ్వడంతో 11 పాయింట్స్‌తో ఆరో స్థానంలో నిలిచింది. ఆ జట్టు చివరి రెండు మ్యాచ్‌లకు మూడు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి నెలకొంది. ఆర్‌సీబీతో మ్యాచ్ రద్దయితే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది.

ముఖా ముఖి పోరు..

ఇరు జట్ల ముఖా ముఖి పోరులో కేకేఆర్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 35 సార్లు తలపడగా.. కేకేఆర్ 20, ఆర్‌సీబీ 15 విజయాలు సాధించాయి. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఆర్‌సీబీ ఓడించింది.

Leave a Reply