Soundarya Lahari – సౌందర్య లహరి 90

90. దదానేదీనేభ్యఃశ్రియమనిశమాశానుసదృశీ

మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి

తవాస్మిన్ మందార స్తబక సుభగేయాతు చరణే

నిమజ్జన్మజ్జీవః కారణ చరణైష్షట్చరణతామ్.     

              తాత్పర్యం: అమ్మా! జగదంబా! ఎల్లప్పుడు దీనులైన వారు కోరిన కోరికలకు తగిన విధంగా సిరిసంపదలనిఅనుగ్రహించేది, అధికమైన సౌందర్యం, సౌభాగ్యం అనే పూదేనెను వెదజల్లుతూ ఉండేది, మందారపూలగుత్తి వలె అందమైనది అయిన నీ పాదపద్మము నందు పంచేంద్రియాలు మనస్సు అనే ఆరుపాదాలతో నేను అనే జీవుడు భ్రమరభావం పొంది లీనమై పోవును గాక!

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply