TG | తిరంగా ర్యాలీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు !

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర జరుగుతోంది.

ఈ క్ర‌మంలో రేపు హైదరాబాద్‌లో కూడా తిరంగ యాత్ర నిర్వ‌హించనున్నారు. తిరంగ ర్యాలీ సందర్భంగా రేపు (శనివారం) హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

రేపు సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్ వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, సెయిలింగ్ క్లబ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి వెహికిల్స్ కు పర్మిషన్ లేదని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి అని సూచించారు.

Leave a Reply