Modi Cabinet | తిరుప‌తి ఐఐటి విస్త‌ర‌ణ … కేంద్ర కేబినేట్ ఆమోదం

న్యూ ఢిల్లీ – కేంద్రం ఎపికి మ‌రో శుభ‌వార్త వినిపించింది.. తిరుప‌తిలోని ఐఐటి విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది.. ఈ మేర‌కు నేడు మోదీ అధ్య‌క్ష‌త జ‌రిగిన కెబినేట్ భేటిలో ఆమోద ముద్ర వేసింది.. ఇక ఈ కేబినేట్ లో సెమీ కండ‌క్ట‌ర్ ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రొత్స‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.. అంతే కాకుండా ఉత్త‌ర ప్ర‌దేశ్ లో బేవ‌ర్ లో ఆరో సెమీ కండ‌క్ట‌ర్ యూనిట్ నిర్మాణానికి నిధులు కేటాయించింది.. దీని వ‌ల్ల ప్ర‌త్య‌క్షంగా రెండు వేల మందికి ఉపాధి ల‌భిస్తున్న‌ద‌ని తెలిపింది.అలాగే డిస్ ప్లే చిప్స్ బెంగుళూరు , నోయిడాల‌లో ఏర్పాటుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. దీని కోసం నాలుగు వేల కోట్లు కేటాయించింది.. వాటి ద్వారా ప్ర‌తి నెల 3.6 కోట్లు చిప్స్ ఉత్ప‌త్తి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించారు.

Leave a Reply