MDK | రాంగ్ రూట్ లో బైక్ ను ఢీకొన్న‌ కారు.. ఇద్దరి పరిస్థితి విషమం

కౌడిపల్లి, మే 13 (ఆంధ్రప్రభ) : అతివేగంగా రాంగ్ రూట్ లో వ‌చ్చిన‌ కారు బైక్ ను ఢీకొట్ట‌డంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని వెంకట్రావుపేట్ గేటు సమీపాన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే… మండల పరిధిలోని రాజపేట గ్రామానికి చెందిన ఊరట్ల లక్ష్మణ్, తోళ్ల రమేష్ ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెంకట్రావుపేట్ నుండి నర్సాపూర్ వైపు వెళుతుండగా నర్సాపూర్ నుండి మెదక్ వైపు వస్తున్న కారు అతివేగంగా రాంగ్ రూట్ లో వచ్చి బైకును ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న రమేష్, లక్ష్మణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply