Tirupati | వ్యాపారి దారుణ హత్య

తిరుపతి : తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచెరువులో మామిడికాయల వ్యాపారి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు ఆయనపై తీవ్రంగా దాడి చేసి హత్య చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మామిడి కాయల వ్యాపారి సత్రాల అశోక్‌ పై దుండగులు రాయితో తీవ్రంగా దాడి చేసి హతమార్చారు. అనంతరం అతని వద్దనున్న బంగారం అపహరించుకొని పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply