JEE Main – 2 పరీక్షలకు షెడ్యూల్ రిల‌జ్..

  • ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు పరీక్షలు

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ ఐటీల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తుండగా, జనవరిలో జేఈఈ మెయిన్-1 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మెయిన్-2 పరీక్ష షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.

ఈ పరీక్షలను ఏప్రిల్ 1 – 8 వరకు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ రాత్రి 9 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. రాత్రి 11.50 గంటల వరకు ఫీజును స్వీకరిస్తామని కంపెనీ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *