నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గ పరిధిలోని పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన సోమేశ్వరుడు అనే రైతు కుటుంబం అప్పుల బాధతో ఈనెల రెండవ తారీకు రాత్రి కూల్ డ్రింకులో గడ్డి మందు కలుపుకొని తాగారు.
తనకున్న పొలంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్న సోమేశ్వరుడు పంటలు సరిగా పండక పోవటం అప్పుల వారు బాధ పెట్టడంతో కుటుంబంలోని మొత్తము 5 గురు కూల్ డ్రింక్ జీరా లో గడ్డి మందు కలుపుకొని తాగారు. వీరిని వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కౌలు రైతు సోమేశ్వరుడు తల్లి శివమ్మ భార్య లావణ్య కూతురు లిఖిత కుమారుడు భరత్ కుమార్ లు కూల్ డ్రింకులు గడ్డి మందు చేసుకుని తాగారు.తాగిన సంఘటనలో
కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుతూ సోమేశ్వరుని కుమారుడు భరత్ కుమార్(9) ఈనెల 23వ తేదీ మరణించగా భార్య లావణ్య (36) ఆదివారం మృతి చెందింది. మిగిలిన ముగ్గురి పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ వారికి చికిత్సలు అందిస్తున్నారు.
ఒకే కుటుంబంలో ఐదుగురు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, అందులో ఇద్దరు మరణించటంతో ఇస్కాల గ్రామంలో బంధువులు గ్రామస్తులు రోదన అరణ్య రోదన గా మారింది. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఉమ్మడి కూటమి నాయకులు ఎమ్మెల్యే ఎంపీలు వారి కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు కోరటం విశేషం.

