బాసర, ఏప్రిల్ 24 (ఆంధ్రప్రభ) : ఆర్జీయూకేటి యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిరవధిక నిరసన దీక్ష గురువారం 16వ రోజుకు చేరుకుంది. 16 రోజులుగా నిరసన చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో సరస్వతి దేవి కరుణించమ్మా అంటూ అమ్మవారి సన్నిధిలో మహిళా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి వినతిపత్రం సమర్పించి పూజలు చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తమ సమస్యలపై స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.