నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : పిసిపిఎన్డిలో చట్టాన్ని ఉల్లంఘించి గర్భిణీ స్త్రీలకు స్కానింగ్‌ల ద్వారా పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అని నిర్ధారించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ హెచ్చరించారు.
ఇందుకు ప్రేరేపించేవారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో డిఎంహె చ్వో మాట్లాడారు. జిల్లాలోని 3 డివిజన్లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సూచనల మేరకు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎవరైతే రిజిస్టర్ చేయకుండా పరీక్షలు నిర్వహించినట్లయిటే అటువంటి వారికి నోటోసీలు ఇస్తూ, పిసిపిఎన్డిటి చట్టాన్ని అతిక్రమించిన వారిపై, అర్హత లేని వ్యక్తులు రిఫర్ చేసిన వారికి, స్కానింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని డిఎంహెచ్వో హెచ్చరించారు.
పిసిపి ఎన్డిటి చట్టం ప్రకారం ప్రతి స్కానింగ్ చేసే వారికి విధిగా రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. ఫారం ఎఫ్ మెయింటెయిన్ చేయాలన్నారు. ఒకవేళ అంతర్ రాష్ట్రం నుంచి వచ్చిన వారికి స్కానింగ్ నిర్వహిస్తే పూర్తివివరాలు నమోదు చేయాలన్నారు.
ఈ సలహా సంఘ సమావేశంలో పివో ఎంసిహెచ్ డాక్టర్ సుప్రియ, గైనకాలజిస్టు డా. బిందు, రేడియాల జిస్ట్ డా. శ్రావణి, పీడి యాట్రీషియన్ డాక్టర్ హరిప్రియ, డ్రగ్ ఇన్స్పె క్టర్ శ్రీలత, సిడిపిఓ సౌందర్య, ఎన్జీవో పద్మసింగ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధ, డిడి మెప్మా కార్యాలయ డీఎంసీ మాధవి లత, నాగలక్ష్మి, డిహెచ్ఈ వేణుగోపాల్, దేవేందర్ పాల్గొన్నారు.