Great Escape | ఉగ్ర‌దాడి నుంచి తృటిలో తప్పించుకున్న న్యాయ‌మూర్తులు , ఎమ్మెల్యేలు

తిరువ‌నంత‌పురం – జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నుంచి కేరళ హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈమేరకు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌ పర్యటనకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి.గిరీష్‌.. ఎమ్మెల్యేలు ముకేశ్‌, కేపీఏ మజీద్, టి. సిద్ధిక్‌, కె.అన్నాలన్ కశ్మీర్ కు వెళ్లారు. ఉగ్రవాదుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని ఓ ప్రకటనలో పేర్కొంది

ఉగ్ర‌దాడిని ఖండించిన సిఎం పిన‌ర‌యి..

ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్‌ విచారం వ్యక్తంచేశారు. ఎర్నాంకులమ్‌కు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అతడి కుటుంబసభ్యులను జాగ్రత్తగా ఇంటికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తామని సీఎం తెలిపారు అని సీఎంవో తెలిపింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కొచ్చిలోని ఎడపల్లికి చెందిన ఎన్. రామచంద్రన్‌ ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *