Japan Tour | సోని కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన రేవంత్ బృందం ..

టోక్యో – జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం టోక్యో లోని సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది. ఈ సంద‌ర్బంగా సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు వివ‌రించారు. ఉత్పత్తులతో పాటు వాటి పని తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్‌పై వివరణాత్మక చర్చలు జరిపింది.

యానిమేషన్, వీఎఫ్ఐ , గేమింగ్ రంగాలలో హైదరాబాద్ లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది. ఎండ్-టు-ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భవిష్యత్తు విజన్​ ను వారితో పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *