లక్నో – ఐదు మ్యాచ్ ల పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు సూపర్ విక్టరీ లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ తో లక్నో లో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ ధోనీ చివరి లో సూపర్ బ్యాటింగ్ చేసి చెన్నై కు గెలుపు అందించాడు. లక్నో సూపర్ జెయింట్స్ 167 పరుగులు చేయగా, దానిని ధోనీ సేన ఐదు వికెట్లు చేతిలో ఉండగానే చేధించింది.
తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ (63) అర్ధశతకంతో అలరించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై 19.3 ఓవర్ల 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబె (43 * ; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు), రచిన్ రవీంద్ర (37), షేక్ రషీద్ (27) పరుగులు చేశారు. చివర్లో ధోనీ (26*; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ లు) విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, అవేశ్ ఖాన్, మార్ క్రమ్, దిగ్వేశ్ ఒక్కో వికెట్ తీశారు.