Shirdi సాయి నాధుని సేవ‌లో మోహ‌న్ బాబు

షిరిడి ప్రభ న్యూస్ – టాలీవుడ్ న‌టుడు, నిర్మాత డా. మోహన్ బాబు నేడు షిర్డీ శ్రీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా త‌న కొత్త చిత్రం భ‌క్త‌క‌న్న‌ప్ప విజయవంతం కావాలని శ్రీ సాయి పాదాలను ప్రార్థించారు. అనంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ భీమ్‌రాజ్ దారాడే ఆయనకు శాలువా, సాయి విగ్రహంతో సత్కరించారు, ఈ సందర్భంగా ఆలయ అధిపతి విష్ణు థోరట్, పౌరసంబంధాల అధికారి తుషార్ షెల్కే పాల్గొన్నారు. ఇక‌ శ్రీ సాయిబాబా సంస్థాన్ నూతన కార్యక్రమాలను తెలుసుకుని ఇక్కడి పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు మోహ‌న్ బాబు. డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమ్‌రాజ్ దారాడే కూడా శ్రీ సాయిబాబా కృపతో ఈసారి తన సినిమా విజయం సాధించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందనే భావనను వ్యక్తం చేశారు.

Leave a Reply