ప్రధాన నిందితుడు అరెస్ట్.. పరారీలో ఇద్దరు
మేడిపల్లి, ఏప్రిల్ 8 (ఆంధ్రప్రభ) : ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో జిమ్ ట్రైనర్, యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందిన సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో సాయికిషోర్ అనే వ్యక్తి జిమ్ ట్రైనర్ గా నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో చంటి అనే పాత స్నేహితుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు జిమ్ వద్దకు వచ్చి జిమ్ లో ఉపయోగించే డంబెల్స్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. అ దాడిలో తీవ్రంగా గాయపడిన సాయికిషోర్ ను బోడుప్పల్ లేని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ సాయికిశోర్ ఇవాళ ఉదయం మృతిచెందాడు. మృతుడి సోదరుడు కిరణ్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు. దాడి చేసిన నిందితుడు చంటిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.