ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ ఛాంపియన్ కోల్‌కతా జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజన్స్ కు భారీ షాక్ తగిలింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుు నమోదు చేసింది.
201 పరుగల టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన హైదరాబాద్… మూడు ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటరర్లు వరుసగా పెవిలియన్ కు క్యూకట్టారు. ఓపెనింగ్ ద్వయం ట్రావిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ (2) కే ఔటవ్వగా.. వన్డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (2) వెనుదిరిగాడు. దీంతో 9 పరుగులకే 2.1 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయింది హైదరాబాద్..
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు దంచికొట్టింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. రఘువంశీ (50), వెంకటేష్ అయ్యర్ (60) అర్ధ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ రహానే (38), రింకు సింగ్ (32) అద్భుతంగా ఆకట్టుకున్నారు. దీంతో కోల్‌కతా స్కోరు భారీగా నమోదైంది.