భారీ అగ్ని ప్రమాదం…

భారీ అగ్ని ప్రమాదం…

  • 36 గడ్డివాములు దగ్ధం
  • ఆకతాయిల పనిగా గుర్తించిన గ్రామస్తులు
  • సుమారు 1.28 కోట్ల రూపాయలు పశుగ్రాసం నష్టం
  • ఆందోళనలో వ్యవసాయదారులు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; ఆరుకాలం కష్టించి పంట పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర లేక నష్టపోతుంటే మరోవైపు పశువులకు వేసే పశుగ్రాసాన్ని తగలబెట్టిన వైనం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి నాటిన తర్వాత కొంతమంది ఆకతాయిలు సిగరెట్లు బీడీలు తాగుతూ కాల్చి అక్కడ వేసినట్లు గ్రామస్తులు గుర్తించారు. వాటికి మంటలు చెలరేగి గడ్డివాములు అంటుకున్నాయి.

సుమారుగా 36 గడ్డివాములు పూర్తిగా తగలబడిపోయాయి. మంటల దగ్గరికి ప్రజలు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయలేదు. అసలే వేసవికాలం గాలి విపరీతంగా వేయడంతో గట్టివాములు వరుసగా అంటుకుంటూ మంటలు పూర్తిగా చెలరేగిపోయాయి. పశువులకు ఆహారంగా వేసే గడ్డివాములు ను తగలబట్టంతో రైతుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశువులకు మేతగా వేసే గడ్డిని కొనుక్కోవాలంటే ఒక ట్రాక్టర్ ఖరీదు సుమారు 14 వెల రూపాయలు ఉంటుందని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు పశువులకు వేసే పశుగ్రాసం పూర్తిగా కాలిపోవడంతో గ్రామంలోని సుమారు 112 మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వము రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నరు.

Leave a Reply