ఎవరికోసం! ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం ఈ ధర్మదీక్ష

ఎవరికోసం! ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం ఈ ధర్మదీక్ష

ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి పిళ్ళా శ్రీనివాసరావు

భవానిపురం, ఆంధ్రప్రభ : బోడె రామచంద్ర యాదవ్ చేస్తున్న ధర్మదీక్ష ఎవరికోసం!ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమని ఎన్టీఆర్ జిల్లా టిడిపి కార్యదర్శి పిళ్ళా శ్రీనివాసరావు ప్రశ్నించారు.ఈ మేరకు ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోడె రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఎవరో చాలామందికి తెలియదని, బీసీవై పార్టీ పేరుతో ఇప్పుడు బీసీల కోసం ధర్మదీక్ష ప్రారంభించారని అన్నారు.

ఈ దీక్ష ఆయన రాజకీయ ఉనికి కాపాడుకునేందుకా?లేక ఏ రాజకీయ పార్టీకైనా మేలు చేసేందుకా అని ప్రశ్నించారు. ఇప్పుడు చేస్తున్న ఈ దీక్ష అనేది ఆయన ఎవరి కోసం చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని విమర్శించారు .

Leave a Reply