కేజీబీవీ జూనియర్ కళాశాల బాలికల హవా..

కేజీబీవీ జూనియర్ కళాశాల బాలికల హవా..
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
కడెం, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల స్పెషల్ ఆఫీసర్ కే విమల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ విమల మాట్లాడుతూ విద్యార్థుల ఫలితాలను వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సీఈసీ గ్రూప్ నుండి 23 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 23 మంది విద్యార్థులు పాసయ్యారన్నారు.
ద్వితీయ సంవత్సరం ఎం పి హెచ్ డబ్ల్యు గ్రూపు నుండి 32 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 32 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. మొదటి సంవత్సరం సి ఈ సి గ్రూప్ నుండి 26 మంది విద్యార్థుల పరీక్షలు రాయగా 25 మంది పాసయ్యారని, ఎం పి హెచ్ డబ్ల్యు నుండి 26 మంది పరీక్షలు రాయగా 25 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం సీఈసీ లో టీ దుర్గాదేవి వెయ్యి మార్కులకు గాను 906 మార్కులు, జి మణి చందన వెయ్యి మార్కులకు గాను 839 మార్కులు, ఏ ఇసురుబాయి వెయ్యి మార్కులకు గాను 827 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారన్నారు. మొదటి సంవత్సరం సిఇసి గ్రూపులో జి వేణు శ్రీ 500 మార్కులకు గాను 463 మార్కులు జి అంజలి 500 మార్కులకు గాను 457 మార్కులు బి గంగోత్రి 500 మార్కులకు గాను 455 మార్కులు సాధించి టాపర్స్ గా నిల్చారన్నారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎం పి హెచ్ డబ్ల్యు గ్రూప్ లో కే వైష్ణవి వేయి మార్కులకు గాను 953 మార్కులు ఎల్ మహేశ్వరి వెయ్యి మార్కులకు గాను 948 మార్కులు ఏ వైష్ణవి వెయ్యి మార్కులకు గాను 934 మార్కులు సాధించి టాపర్స్ గా నిలిచారన్నారు.
మొదటి సంవత్సరం ఎం పి హెచ్ డబ్ల్యు గ్రూప్ లో కే వైష్ణవి 500 మార్కులకు గాను 459 మార్కులు బి నందిని 500 మార్కులకు గాను 459 మార్కులు బి రాజేశ్వరి 500 మార్కులకు గాను 443 మార్కులు సాధించి టాపర్స్ గా నిల్చారని కళాశాల ఎస్ ఓ కే విమల పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించి సత్తా చాటిన విద్యార్థులకు కళాశాల ఎస్ ఓ విమల అధ్యాపక ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులకు అభినందించారు.
