అన్నదానానికి విరాళం…

అన్నదానానికి విరాళం…
విజయవాడ, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి నల్గొండ సత్యనారాయణ కుటుంబీకులు జయలక్ష్మి వంశీకృష్ణ పేర్లు మీద రూ.1,28,166/- విరాళంగా అన్నదానం విభాగమునకు వినియోగించవలసిందిగా ఆలయ అధికారుల్ని కలిసి విరాళమును అందజేసి ఉన్నారు.
వీరికి అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం ప్రధానాలయ సూపర్డెంట్ డివివి సత్యనారాయణ ధర్మకర్త మండలి సభ్యుడు వెలగపూడి శంకర్ బాబు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.
