ముధోల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

ముధోల్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ముధోల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా (ప్రెస్ క్లబ్) లో విలేకరులు అందరూ సమావేశమై కమిటీని ఎన్నుకున్నారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జోంద్లే సునీల్, ఉపాధ్యక్షులుగా సొన్కాంబ్లే రాహుల్, మల్లేష్ , ప్రధాన కార్యదర్శిగా ముఫ్తీ రాయిస్ ఖాస్ మి, కోశాధికారిగా దొంతుల్వార్ రమేష్, సంయుక్త కార్యదర్శి శరత్ గాయక్ వాడ్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు జోంద్లే సునీల్ మాట్లాడుతూ… పాత్రికేయులు సమాజానికి అధికారులకు పారదర్శకంగా ఉండాలని అన్నారు.
అన్ని విధాలుగా అందరిని కలుపుకొని పోతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు దుర్గాప్రసాద్, మురళిగౌడ్, తిరుపతి గౌడ్,విజయ్, పి.నాగేష్,నాగేష్, పవన్, బషీర్, అజీమ్, సుభాష్, గంగారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
