EU Opposed : టోల్ వ‌ద్దు Andhra Prabha News

EU Opposed : టోల్ వ‌ద్దు Andhra Prabha News

ఈయూ అభ్యంత‌రం

( ఆంధ్ర‌ప్ర‌భ‌, లండ‌న్ ప్ర‌తినిధి)

EU Opposed : హోర్ముజ్ టోల్ వ‌సూలు ఆలోచనను యూరోపియ‌న్ యూనియ‌న్ ఖండించింది, హోర్ముజ్ జ‌ల‌సంధిని నియంత్రించే అవ‌కాశాన్ని ఈయూ వ్య‌తిరేకించింది. కీలక గల్ఫ్ జలమార్గం మీదుగా ఓడలను అనుమతికి రుసుము వసూలు చేస్తామ‌ని రెండువారాల కాల్పుల విర‌మ‌ణ ఒప్పందంలో హోర్మ‌జ్ జ‌లసంధిలో రాక‌పోక‌ల కు టోల్ వ‌సూలు చేస్తామ‌ని ఇరాన్ స్ప‌ష్టం చేసింది. ఈ డిమాండును ఈయూ తీవ్రంగా వ్య‌తిరేకించింది. హోర్ముజ్ జలసంధిలో “ఎలాంటి చెల్లింపు లేదా టోల్ లేకుండా” నౌకాయాన స్వేచ్ఛను తప్పనిసరిగా నిర్ధారించాలని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. ఇక కాల్పుల విరమణపై కుదిరిన నిజమైన ఒప్పందం పూర్తిగా పాటించేంత వరకు” ఇరాన్ చుట్టూ “అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది” మోహరించి ఉంటారని, లేకపోతే మరిన్ని ఘర్షణలు చెలరేగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

Leave a Reply