మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్ కుషాలి

మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్ కుషాలి

చిలుపూర్, ఆంధ్ర ప్రభ : మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని మల్కాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ కుషాలి కోరారు. చిలుపూర్ మండలం మల్కాపూర్ సబ్ సెంటర్లో బుధవారం మహిళలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఎడవెల్లి లావణ్య అధ్యక్షత వహించగా డాక్టర్ కుషాలి మాట్లాడుతూ తల్లులు వారి ఆరోగ్యం పట్ల నిరంతరం జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఆమె అన్నారు.

గర్భిణి స్త్రీలు నెలవారి తీసుకోవలసిన జాగ్రత్తలను పాటిస్తూనే మరోవైపు పోషక పదార్థాలను తీసుకోవాలని ఆమె కోరారు అదేవిధంగా చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లులు జాగ్రత్త తీసుకోవాలని పోషక పదార్థాలను సమపాళ్లలో అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ అందిస్తున్న పోషక పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పసుల వెంకటేష్, ఎఎన్ఎం సబితతో పాటు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Leave a Reply