అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టిక ఆహారం

అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టిక ఆహారం

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని మండేలగూడెం గ్రామ సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ అన్నారు. మంగళవారం మండలగూడెంలోని అంగన్వాడి 1వ, 2వ సెంటర్లలో గాదె శ్రీలత, గాదె అండాలు ఆధ్వర్యంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.

ఈసమావేశానికి కమిటీ చైర్ పర్సన్ సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ 3సంవత్సరాల నుండి 6 సంవత్సరాల తల్లులు గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం గురించి చెప్పడం జరిగింది. గర్భిణీలు సరైన పౌష్టిక ఆహారం తినడం వలన ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని తల్లులకు చెప్పడం జరిగింది. ఈకార్యక్రమంలో కమిటీ సభ్యులు, వార్డు నెంబర్లు ఏదునూరి, వనజ, పెసర్ ప్రేమలత, గర్భిణీలు, బాలింతలు ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల తల్లులు హాజరు అయ్యారు.

Leave a Reply