భూగర్భజలాల స్థాయిని పెంపొందించడమే ‘జలధార ప్రాజెక్ట్’ లక్ష్యం…

భూగర్భజలాల స్థాయిని పెంపొందించడమే ‘జలధార ప్రాజెక్ట్’ లక్ష్యం…

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము..
సిద్ధాంతంలో…. కాలువల పూడికతీత పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
గ్రామస్తులతో కలిసి,పలుగు పారతో…కాలువల్లో మట్టి తొలగింపు పనులు చేసిన ఎమ్మెల్యే….
వంద రోజుల కార్యచరణ ద్వారా కలిగే ప్రయోజనాలను…రైతులు, ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే

గుడివాడ – ఆంధ్రప్రభ : రాష్ట్రంలో భూగర్భ జలాల స్థాయిని పెంపొందించేందుకే ప్రభుత్వం జలధార ప్రాజెక్టును ప్రవేశపెట్టిందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. జలమట్టం పెంపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జలధార ప్రాజెక్ట్ లో భాగంగా గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతం గ్రామంలో జరుగుతున్న పూడిక తీత పనుల్లో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి పలుగు పారతో కాలువల్లో మట్టిని తొలగిస్తూ ఎమ్మెల్యే రాము స్వయంగా పూడిక తీశారు. జలధార ప్రాజెక్టు వంద రోజుల కార్యాచరణ వల్ల కలిగే ప్రయోజనాలను రైతులు, గ్రామస్తులకు ఎమ్మెల్యే రాము వివరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ జలమట్టాలను పెంచేందుకు, నీటి భద్రత కోసం వంద రోజుల పాటు కార్యచరణ చేపట్టామన్నారు. చెరువుల్లో పూడికతీత, కాలువల మరమ్మతులు, భూగర్భజలమట్టం పెంపు లక్ష్యంగా 4 దశల్లో కార్యక్ర మాన్ని అమలు చేస్తామన్నారు. సాగునీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యతనే నినాదంతో పని చేయాలన్నారు.

మండల, గ్రామస్థాయిలో చెరువుల పూడికతీతతో భూగర్భజలాల స్థాయిని పెంపొందించడమే ‘జలధార ప్రాజెక్ట్’ ఉద్దేశ మని అన్నారు. ఎండిఓ విష్ణు ప్రసాద్, మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, టిడిపి నాయకులు వంశీకృష్ణ,కట్టా శ్రీనివాసరావు, వక్కలగడ్డ కాశీ, తోట సురేష్, అన్నవరపు నాగరాజు, కోరుమిల్లి స్వామి, రషీద్ బేగ్, సుబ్బారావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply