Irgc Chief Killed : మజీద్ ఖాదేమి ఖతం Andhra Prabha News

Irgc Chief Killed : మజీద్ ఖాదేమి ఖతం Andhra Prabha News
- ఐఆర్జీసీకి చావు దెబ్బ
- వైమానిక దాడి.. 25 మందికి పైగా మృతి
- 6 గురు చిన్నారుల మృతి.. బహరెస్తాన్‌లో విషాదం
- మరో ఇద్దరు ఐఆర్జీసీ ఉన్నతాధికారులు హతం
- నివాస ప్రాంతాలపై దాడులు.. పౌరులే బలి
- ఖాదేమి లక్ష్యంగా దాడి.. ఇజ్రాయెల్ ధృవీకరణ
- ఇరాన్ నాయకత్వానికి వరుస దెబ్బలు
( ఆంధ్రప్రభ, టెహ్రన్ ప్రతినిధి)
Irgc Chief Killed : ఇరాన్ ఆయువు పట్టు పారామిలిటరీ దళం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇంటెలిజెన్స్ అధిపతి మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ ఖాదేమి (Majid Khademi) సోమవారం (ఏప్రిల్ 6, 2026) తెల్లవారుజామున జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించారు. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 6, సోమవారం తెల్లవారుజామున 4.00 గంటలకు జరిగిన ఈ దాడుల్లో ఖాదేమి మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది.
Irgc Chief Killed : టెహ్రాన్ సమీపంలోని బహరెస్తాన్ కౌంటీ (Baharestan County) లో నివాస ప్రాంతాలపై జరిగిన వరుస వైమానిక దాడుల్లో ఆయన మరణించారు. ఈ దాడుల్లో ఆయనతో పాటు మరో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు (నలుగురు బాలికలు , ఇద్దరు బాలురు ) ఉన్నారు. వీరంతా ఆ భవనంలో నివసిస్తున్న సామాన్య పౌరులేనని సమాచారం. ఖాదేమితో పాటు వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఐఆర్జీసీ (IRGC)కి చెందిన మరో ఇద్దరు ఉన్నతాధికారులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ దాడిని ధృవీకరిస్తూ, ఖాదేమి తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారని, ఆయనను తమ ప్రధాన లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించారు.
Irgc Chief Killed : 2025 జూన్‌లో ఇజ్రాయెల్ దాడిలో మరణించిన మొహమ్మద్ కాజెమీ స్థానంలో మజీద్ ఖాదేమి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలో ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ హెడ్‌గా పనిచేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫిబ్రవరిలో జరిగిన దాడిలో మరణించిన తర్వాత, ఖాదేమి మరణం ఇరాన్ నాయకత్వానికి మరో కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. నిర్దిష్ట ప్రదేశం: టెహ్రాన్ ప్రావిన్స్‌లోని ఒక నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించారు.
