వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలి

వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలి

తెలంగాణ రన్నర్స్ ప్రోమో రన్ విజయవంతం
వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం నాయక్

జనగామ అర్బన్, ఆంధ్రప్రభ : నేడు సమాజంలో పెరిగిపోతున్న చెడు వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలని వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం నాయక్ కోరారు. ఆదివారం తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో జనగాం పట్టణంలోని బతుకమ్మ కుంట నుండి షామీర్‌పేట్ వరకు 2కే , 5కే, 10కే ప్రోమో రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమమూలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం నాయక్, జనగామ మున్సిపల్ చైర్మన్ బాలమణి శ్రీనివాస్ ,పట్టణ సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ యువత సమాజంలో మద్యం, మారకద్రవ్యాలు గంజాయి వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి, మంచి మార్గంలో ముందుకు సాగాలని, క్రీడల్లో రాణించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో దాదాపు 400 మందికి పైగా రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్ పి ఆర్ పాఠశాల యజమాన్యం,తాజ హోటల్ యజమాన్యం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థలు అవంతిక కన్స్ట్రక్షన్స్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రన్నర్స్ సభ్యులు హరీష్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, శ్రీనివాస్, ఎస్ పి ఆర్ స్కూల్ కరస్పాండెంట్ కీర్తి వీరేందర్, కౌన్సిలర్ బాల భరద్వాజ్, పాము కుంట్ల ప్రసాద్ ,కె.వి.ఎల్.ఎన్ రెడ్డి, రామేశ్వర చారి, మంగళంపల్లి రాజు,పిట్టల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply