టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ జన్మదిన వేడుకలు

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ జన్మదిన వేడుకలు
పిల్లల మధ్య సేవా కార్యక్రమాలతో నిర్వహణ
విజయవాడ, ఆంధ్రప్రభ : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న) జన్మదినం సందర్భంగా గాంధీనగర్‌లోని ఎస్ కే సి వి చిల్డ్రన్స్ ట్రస్ట్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగరాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెవర సాయి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వేదపండితులు ఆశీర్వాదాలు అందించగా, అనంతరం పిల్లల మధ్య గన్నె ప్రసాద్ పుట్టినరోజు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయం చైర్మన్ యం.ఎస్. బేగ్, కరణం మోహన్, సరేపల్లి రాధాకృష్ణ, యేదుపాటి రామయ్య, ధనేకుల సుబ్బారావు, పెద్దిన శ్యామ్, బుర్ర కనకరావు, పైలా సతీష్ తదితరులు పాల్గొన్నారు.

