వాగులో పడి విద్యార్థులు మృతి..

వాగులో పడి విద్యార్థులు మృతి..
చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం నష్కల్ ఆకేరు వాగులో ఇరువురు విద్యార్థులు ప్రమాదవశాత్తు పడి గురువారం రాత్రి మృతి చెందారు. మండలంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె మనోజ్ కుమార్ (12), గూటం అకిరానందం (12) ఇద్దరు స్నేహితులు పక్కనే ఉన్న నష్కల్ గ్రామంలో జరుగుతున్న జాతరను చూసేందుకు సైకిల్ పై వెళ్లారు. పక్కనే ఉన్న ఆకేరు వాగులో తెప్ప ఉండగా దాని పై సైకిల్ ను ఎక్కించి వారు కూడా కూర్చుని అవతలి గట్టుకు వెలుతున్న క్రమంలో అదుపు తప్పి ఇరువురు ఆకేరు వాగులో పడిపోయారు. వారికి ఈత రాకపోవడంతో నీటిలో ఊపిరి ఆడక మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వరంగల్ ఎంజిఎంకు పోలీసులు తరలించారు.
