అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం.. ఎంపీకి అభినందనలు

అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం.. ఎంపీకి అభినందనలు

విజయవాడ,ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఈరోజు లోక్‌సభలో ఆమోదం లభించిన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ పరిణామం రాష్ట్ర రాజధాని అంశానికి కీలక మలుపుగా భావిస్తున్నారు.ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని ను ఏపీ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పార్లమెంట్ వద్ద కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.


అమరావతి రాజధాని అంశంపై కేంద్ర స్థాయిలో ఈ నిర్ణయం రావడం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి చట్టబద్ధత లభించడం ద్వారా భవిష్యత్ ప్రణాళికలు వేగవంతం కావచ్చని అభిప్రాయపడ్డారు. అమరావతి అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల విస్తరణకు కొత్త దిశ లభించనుందని డుండి రాకేష్ ఆకాంక్షించారు.

Leave a Reply