పొందూరులో టీబీ ముక్త భారత్ అభియాన్

పొందూరులో టీబీ ముక్త భారత్ అభియాన్

క్యాన్సర్ రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ
పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవికుమార్..

పొందూరు(ఆమదాలవలస), ఆంధ్రప్రభభ : పొందూరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ రోగులకు న్యూట్రిషనల్ కిట్లను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పి యూ సి చైర్మన్ కూన రవికుమార్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూన రవికుమార్, డిఎంఎస్ఎల్ సంస్థ అందించిన ఆర్థిక సహకారంతో క్యాన్సర్ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్యాన్సర్, టిబి వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సరైన పోషకాహారం ఎంతో అవసరమన్నారు . ప్రభుత్వం చేపట్టిన టిబి ముక్త భారత్ అభియాన్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, రోగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ లో రోగులకు అందుతున్న సేవలు వైద్యుల హాజరును పరిశీలిస్తూ హాస్పిటల్ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు సేకరిస్తూ హాస్పిటల్ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి కావల్సిన నిధులు విడుదలకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply