విద్యార్థిని మృతి ఘటన లో

విద్యార్థిని మృతి ఘటన లో

ఉపాధ్యాయుల తొలగింపు

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు గురుకుల పాఠశాల విద్యార్థిని ఇందు ఆత్మ హత్య ఘటన లో అజగ్రత్తగా వ్యాహరించిన ఇద్దరు ఉపాధ్యాయులను విధులనుంచి తొలగించినట్లు కాళేశ్వరం జోనల్ అధికారిణి సి హెచ్ గిరిజ ఇవ్వాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల లో జరిగిన సంఘటన పై సిబ్బంది, తోటి బాలికలతో పూర్తి విచారణ జరిపి జిల్లా కలెక్టర్ తో పాటు సొసైటీ ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. విద్యార్థిని గుర్తు తెలియని దడ్రవానాన్ని తాగినట్టు టీచరకు గాని హెల్త్ సుప్రవైజర్ గాని తెలియజేసినట్లయితే సత్వరమే మెరుగైన వైద్య సేవలు అందించేవారని పేర్కొన్నారు. విచారణ లో మంచిర్యాల జిల్లా సమన్వయ అధికారిణి రామ కళ్యాణి, సోసైటీ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply