ఆ స్కూల్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాలి…

ఆ స్కూల్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాలి…

బోడుప్పల్, ఆంధ్రప్రభ : బోడుప్పల్ లోని సిద్ధార్థ స్కూల్‌లో ఇష్టానుసారంగా ఫీజులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పేరెంట్స్ సోమవారం స్కూల్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బ్రాండ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను బాధుతున్న సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. ఫీజులు విపరీతంగా పెంచి విద్యార్థుల జీవితంతో వ్యాపారాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అడ్మిషన్లు తీసుకున్నప్పుడు ఫీజు పెంపుపై సరైన వివరణ ఇవ్వలేదని, కానీ నేడు 20 నుండి 25% ఫీజులు పెంపు చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పర్సంటేజ్ తగ్గించి న్యాయం చేయాలని స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనికి సరైన వివరణ ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం వెళ్లిపోయారు. స్కూల్లోనే విద్యార్థులకు బుక్స్, స్టేషనరీ అధిక ధరలకు అమ్ముతూ స్కూల్ యాజ‌మాన్యం వ్యాపారం చేస్తున్నార‌ని వాపోయారు.

Leave a Reply