ఉల్లాస్ పథకంలో భాగంగా నిరక్షరాసులకు పరీక్షలు..

ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ తండా నిరక్షరాస్యులైన వయోజన మహిళలకు ఉల్లాస్ పథకంలో భాగంగా గ్రామ సర్పంచ్ ధూమ నాయక్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి గోపిడి రమణారెడ్డి ఆదివారం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… నూరు శాతం అక్షరాస్యతను సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ పథకాన్ని అమలు చేస్తున్నాయన్నారు.
దీనిలో భాగంగా 15 ఏళ్ల పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు చదవడం, రాయడం నేర్పిస్తున్నారన్నారు. ఈ పరీక్షకు 25 మంది మహిళలు హాజరయ్యారు. వారం రోజుల్లో ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంబర్ సింగ్, ఐకేపీ సిసి సాయినాథ్, విఓఎ అర్జున్, వీఓ అధ్యక్షులు అంగురి బాయి, స్వయం సహాయక సంఘం సభ్యులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
