Telangana | కవిత పార్టీపై కాంగ్రెస్ స్పందన

Telangana | కవిత పార్టీపై కాంగ్రెస్ స్పందన
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో చర్చలు సాగుతున్న వేళ, మాజీ ఎమ్మెల్సీ కవిత నిర్ణయంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రాజకీయ పార్టీ స్థాపించే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు.
కవిత కొత్త పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని కాంగ్రెస్ తరఫున స్వాగతిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే పార్టీ స్థాపించడం సులభమైన పని అయినప్పటికీ, దాన్ని విజయవంతంగా నడపడం మాత్రం ప్రజల మద్దతుపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
ప్రజలు ఆదరిస్తేనే ఏ పార్టీ అయినా నిలబడగలదని, కేవలం పార్టీ ప్రకటించడం సరిపోదని, క్షేత్రస్థాయిలో ప్రజల విశ్వాసం సంపాదించుకోవడం కీలకమని అన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ వచ్చినా కాంగ్రెస్కు ఎలాంటి నష్టం ఉండదని, తమ ఓటు బ్యాంక్ దృఢంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వ పనితీరుపై విశ్వాసంతో ఉన్నారని, కాంగ్రెస్ విధానాలకు మద్దతు కొనసాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
