వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్

వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్
వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసిన పోలీసులు
చిట్యాల, ఆంధ్రప్రభ : వేసవికాలంలో విద్యార్థులు, సెలవుల అనంతరం గ్రామ సమీపంలోని బావులు, వాగులు, తదితర ప్రాంతాల్లో ఈత కోసం వెళ్తారని, వారి పట్ల తల్లిదండ్రులు ,జాగ్రత్త తీసుకోవాలని, చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ కోరారు. శుక్రవారం ఎస్ఐ ఆదేశాలతో కానిస్టేబుల్ సందీప్, క్షేత్రస్థాయిలో బావుల వద్ద ఈత కొడుతున్న విద్యార్థులను కలిసి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,బావుల్లో లోతు తెలియకుండా దిగడం, నీటిలో నాచు లేదా బురద ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంద అన్నారు.
తల్లిదండ్రులకు తెలియకుండా బావుల వద్దకు రావడం సరికాదని, ప్రాణాల కంటే వినోదం ముఖ్యం కాదని హితవు పలికారు.వేసవి కాలం దృష్ట్యా విద్యార్థులు , ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా, చదువుపై దృష్టి సారించాలని ఎస్సై సతీష్ కోరారు .
