వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం

వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం
ఉరవకొండ రూరల్,ఆంధ్రప్రభ : మండలం లోని బూదగవి గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని, శుక్రవారం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజా మున ఆలయంలో స్వామి వారికి అభిషేకం, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించగా, వేద మంత్రోచ్చారణల మధ్య భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మహా మంగళహారతి కార్యక్రమాలు,

అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అర్చకులు లక్ష్మీ కాంతారావు, అనిల్, గురు, గ్రామ మాజీ సర్పంచ్ చత్ర గుడి చిరంజీవి, హనుమంత రాయుడు, చత్ర గుడి సుధాకర్, వీరప్ప గౌడ్, నగేష్ గౌడ్, ఉమేష్, ఎర్రి స్వామి, చక్రి, నాగేంద్ర, గాదిలింగప్ప తదితరులు పాల్గొన్నారు.
