26marchspecialstory1 | ఆంధ్రప్రభలో నేటి ప్రత్యేక వ్యాసం

26marchspecialstory1 | ఆంధ్రప్రభలో నేటి ప్రత్యేక వ్యాసం
26marchspecialstory1 యుద్ధం కొనసాగుతూనే ఉంది: విరామం ఫలితం?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
హార్మూజ్ జలసంధి వ్యూహాలు
అమెరికా-ఇరాన్ వ్యూహాత్మక పోరు
సౌదీ, పాకిస్తాన్ పాత్ర
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ఇప్పట్లో ముగిసేట్టు లేదు. ఐదు రోజుల విరామంను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా, ఇరువైపులవారు కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇస్లామాబాద్‌లో ఇరానియన్లు, అమెరికన్లు సంప్రదింపులు జరపవచ్చని వార్తలు వస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్, ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. తమ లక్ష్యాన్ని సాధించామని ప్రకటించుకునే వరకూ ఎవరో ఒకరు ప్రకటించుకునే వరకూ ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలు అయింది. టెహరాన్ తాము స్పష్టమైన జవాబు కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. ఇరాన్ లొంగిపోవాలని అమెరికా, ఇజ్రాయెల్‌లు చూస్తున్నాయి. కానీ, ఇజ్రాయెల్‌ని దెబ్బతీయడానికి ఇదే అవకాశంగా ఇరాన్ భావిస్తోంది.

అమెరికా వద్ద యుద్ధసామగ్రి అపారంగా ఉంది. దానిని ఎలా ప్రయోగించాలన్న గందరగోళంలో ఉంది. క్షేత్ర స్థాయిలో ఆపరేషన్స్‌కి అవకాశం ఉంటుందేమోనని ఎదురు చూస్తోంది. ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్‌లో పోరాడుతూనే పొరుగున ఉన్న పర్షన్ గల్ఫ్ దేశాల పై దాడులు నిర్వహిస్తోంది. ఇండియా, పాకిస్తాన్ తదితర దేశాలకు వస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. నాల్గవది పొరుగున ఉన్న సౌదీ అరేబియాను ఈ యుద్ధంలో ఎక్కువగా పాల్గొనేట్టు ఇరాన్ చేస్తోంది. ప్రపంచ దేశాల పై ఒత్తిడికి హార్మూజ్ జలసంధిని మూసివేసేట్టు ఒత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది. అమెరికా పై ఒత్తిడి తేవడమే ముఖ్యోద్దేశ్యం. శ్రీలంక వంటి దేశాలు ఈ యుద్ధంలో చేరేందుకు ప్రయత్నించాయి. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడం లేదు. అమెరికా అగ్రరాజ్యం కావడం వల్ల అగ్రాధిపత్యంను కలిగి ఉండటం వల్ల, సైనికంగా బలోపేతం కావడం వల్ల వాషింగ్టన్ ఇరాన్‌ని ఎలాగైనా లొంగదీసుకవాలని చూస్తోంది.
అయితే, ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలు అమెరికాను మరింత చిక్కుల్లో పడవేస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇరుక్కోవడం ఇష్టం లేక సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఇరానుప్పకూలి పోవాలని నిర్ణయించాయి. ఈ యుద్ధంలో ప్రవేశించడం వల్ల వచ్చే నష్టాలు పాకిస్తాన్ సైనికదళాల ప్రధానాధికారి ముందే గ్రహించారు. గాజాలో శాంతి కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డులో సభ్యత్వాన్ని కలిగి ఉన్న పాక్ ఇరాన్ యుద్ధంలో తలదూర్చేందుకు ఇష్టపడటంలేదు. గిల్జిత్, బాల్టిస్తాన్‌లలోని సైనిక వ్యవస్థలపై దాడుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాదిరి సంఘటనలు మే 9వ తేదీన జరిగిన దాడులతో సమానం అని హెచ్చరించారు. సౌదీ భద్రతకు కట్టుబడి ఉంది. ముఖ్యంగా మక్కా, మదీనా పుణ్య క్షేత్రాల రక్షణకు కట్టుబడి ఉంది.
అయితే, పాకిస్తాన్ ఆర్థిక బలహీనతలు దృష్టిలో ఉంచుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం సౌదీ ప్రభుత్వం ఈ యుద్ధంలో జోక్యం చేసుకుంటే పాకిస్తాన్ విడిగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సౌదీ మద్దతు పాకిస్తాన్ అణుకార్యక్రమానికి పరిమితం అని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా అనుమతి లేకుండా అణు పరిజ్ఞాన బదిలీ వల్ల వచ్చే పరిణామాలు గురించి పాకిస్తాన్‌కు తెలుసు. ఇస్లామాబాద్ తీసుకునే చర్యలకు సౌదీ పరిశీలన ఎక్కువగా ఉంటుంది. సౌదీకి పాకిస్తాన్ సంప్రదాయ మద్దతు కొనసాగుతుంది. అమెరికా, ఇరాన్‌లను ఒకే వేదిక పైకి తీసుకుని రావడంలో పాకిస్తాన్ పాత్ర ప్రధానం. ఉద్రిక్తతలను తగ్గించడంలో కూడా పాకిస్తాన్ పాత్ర ముఖ్యం. అందువల్ల సౌదీ అరేబియాకు తెలియకుండా పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకోదు. ఇరాన్ యుద్ధంలో సౌదీ అరేబియా, పాకిస్తాన్ పాల్గొనకపోవడానికి ఇదే ప్రధాన కారణం.
-ఆయేషా సిద్ధిఖా @Iamthedrifter
సీనియర్ ఫెలో ఎట్టి డిపార్టుమెంట్ ఆఫ్ వార్ స్టడీస్
ఎట్ కింగ్స్ కాలేజీ, లండన్
