యువత నైపుణ్యాన్ని పెంచుకోవాలి..

యువత నైపుణ్యాన్ని పెంచుకోవాలి..

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
యువతకు ఉద్యోగావకాశాల వేదికగా జాబ్ మేళా ప్రారంభం

తిరువూరు, ఆంధ్రప్రభ : యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేలను తిరువూరులో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్టీఆర్ వికాస, ఎన్టీఆర్ జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి.ఆర్.డి.ఎ–సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను సోమవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమం యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళాను తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

సంస్థలు, అభ్యర్థులు ఒకే వేదికపైకి రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో పలువురు ప్రముఖ సంస్థలు పాల్గొని అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు.

Leave a Reply