Karnataka | ఆరు నెల‌ల పాటు బిజెపి ఎమ్మెల్యేలు స‌స్పెన్ష‌న్ …

బెంగ‌ళూరు – కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు వారిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ యూటీ ఖాదర్ తెలిపారు. ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వథ్ నారాయణ్ కూడా ఉన్నారు.

కర్ణాటకలో మంత్రులు సహా పలువురు ప్రజాప్రతినిధులపై ‘హనీ ట్రాప్’ ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం అక్కడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అనేక మంది మంత్రులు సహా ముఖ్య నేతలే లక్ష్యంగా ఈ ‘హనీ ట్రాప్’ కొనసాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీలో బీజేపీ సభ్యులు లేవనెత్తారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. విచార‌ణ జ‌రిపిస్తామ‌ని హోం మంత్రి ప్ర‌క‌టించినా బిజెపి స‌భ్యులు ఖాత‌రు చేయ‌కుండా స‌భా కార్య‌క్ర‌మాల‌ను ఆడ్డుకున్నారు. దీంతో పోడియం వ‌ద్ద ధ‌ర్నాకు దిగిన 18 మందిని స్పీక‌ర్ స‌స్పెండ్ చేశారు.

Leave a Reply