సామూహిక ప్రార్ధనలతో ముగిసిన ఉపవాస దీక్షలు

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణ శివారులోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులందరులు సామూహిక ప్రార్ధనలు చేశారు. నెలరోజులుగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు ఇవాళ రంజాన్ పర్వదినం సందర్భంగా సామూహిక ప్రార్ధనలతో ఉపవాస దీక్షలను విరమించారు. ఈద్గా వద్ద మత గురువు అబ్దుల్ కవి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

రంజాన్ సామూహిక ప్రార్ధన సందర్భంగా ఈద్గా వద్దకు బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి ,మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ముస్లిం సోదరులను ఆలింగణం చేసుకొని వారు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నెల రోజులపాటు ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లిం సోదరులు రంజాన్ పండుగతో దీక్షలు విరమించడం జరుగుతుందన్నారు.

పవిత్రంగా నెల రోజులపాటు దీక్షలు చేపట్టి ఆధ్యాత్మిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అన్ని కులాలు, మతాలు సమానంగా గౌరవించే సమాజం మన వద్ద ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పండగలను కలిసి మెలిసి జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను భక్తుశ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకోవాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి .లక్ష్మారెడ్డి, కట్టా సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్ ,వాకిటి హన్మంతు, అమరేందర్ రెడ్డి,గోవర్ధన్ ,నీలా గౌడ్, మేదరి శ్రీనివాసులు, పసుల రంజిత్ రెడ్డి, గోవిందరావు ,బోయ వెంకటేష్, వల్లంపల్లి లక్ష్మణ్ ,బిఆర్ఎస్ నాయకులు రాజుల ఆశిరెడ్డి, చిన్న హనుమంతు, అన్వర్ హుస్సేన్,మన్నాన్ , కాంగ్రెస్ నాయకులు రహీం పటేల్ ,బి.శంషుద్దీన్, నూరుద్దీన్, భంజూర్ ,సాలంబిన్ ఉమర్ బస్రవి, హుసాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సీఐ రాంలాల్ ,ఎస్సై వై. భాగ్యలక్ష్మి రెడ్డి తమ సిబ్బందితో ఈద్గా వద్ద బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా వారు ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply